ధమాకా సినిమాలోని జింతాక్ లిరికల్ వీడియో రోజురోజుకూ ఆదరణ పెంచుకుంటూ పోతుంది. ధమాకా లిరికల్ సాంగ్స్ అన్నీ కూడా ఆడియన్స్ ను మెప్పించగా, అన్నిటిలోకి జింతాక్ సాంగ్ మాత్రం ఇప్పటికీ యూట్యూబులో మిలియన్ల కొద్దీ వీక్షణలను రాబడుతూ ఆడియన్స్ హాట్ ఫేవరెట్ గా నిలిచింది. జింతాక్ సాంగ్ కు యూట్యూబులో 80మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చినట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ఈ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 23న విడుదలై, బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ సక్సెస్ సాధించింది.