ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలపతి 67 పూజా వీడియో విడుదల చేసిన మేకర్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 06:41 PM

'వారిసు' బ్లాక్ బస్టర్ తదుపరి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ నెల 2 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి క్యాస్ట్ ఎనౌన్స్మెంట్ జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఎనౌన్స్మెంట్ ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు సంజయ్ దత్, హీరోయిన్స్ త్రిష, ప్రియా ఆనంద్, యాక్షన్ కింగ్ అర్జున్,శాండీ, గౌతమ్ మీనన్, మ్యాథ్యు థామస్, మన్సూర్ అలీఖాన్, మిస్కిన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  


అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 7 స్క్రీన్ స్టూడియోస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
తాజాగా తలపతి 67 పూజా కార్యక్రమ వీడియోను కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ గా విడుదల చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com