ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో రెండు రోజులలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న కోవై సరళ 'సెంబి'

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 06:40 PM

మైనా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కోలీవుడ్ దర్శకుడు ప్రభు సోలమన్ ఇటీవలే 'సెంబి' అనే ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ బాక్స్ఆఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. తాజగా ఇప్పుడు, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ సినిమా ఫిబ్రవరి 3 నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని ప్రకటించింది. ఈ చిత్రంలో అశ్విన్ కుమార్ లక్ష్మీకాంతన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
ఈ చిత్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన కోవై సరళ కూడా సీరియస్ పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ఆమె 70 ఏళ్ల వృద్ధురాలి క్యారెక్టర్‌ని పోషిస్తున్నట్లు సమాచారం. ఇంటెన్స్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ చిత్రాన్ని AR ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్‌పై R రవీంద్రన్, అజ్మల్ ఖాన్ మరియు రేయా నిర్మించారు. నివాస్ కె ప్రసన్న సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com