గీత్ ఆనంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం "గేమ్ ఆన్". దయానంద్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్స్, గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై రవి కస్తూరి నిర్మిస్తున్నారు. నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్ సంగీతం అందించారు.
కాసేపటి క్రితమే గేమ్ ఆన్ ఫస్ట్ గ్లిమ్స్ విడుదలైంది. దీంతో రియల్ టైం సైకలాజికల్ నేపథ్యంలో హై వోల్టేజ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. గ్లిమ్స్ వీడియో సినిమాపై ప్రేక్షకుల ప్రత్యేక దృష్టిని ఆకర్షించేలా ఉంది.