మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా "ప్రాజెక్ట్ కే". దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీరోల్స్ లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై CH అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాపై వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, అతి త్వరలోనే ప్రాజెక్ట్ కే టీం నుండి బిగ్ అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది. మరి, ఈ అప్డేట్ టైటిల్ ఎనౌన్స్మెంట్ గురించా, లేక గ్లిమ్స్ ఆ, లేక కొత్త నటుడి పరిచయమా..? తెలుసుకోవాలని డార్లింగ్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.