ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పఠాన్' మొదటి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 05:56 PM

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ థ్రిల్లర్ డ్రామా అమెరికా, ఇండియాలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ 1వ వారం విజయవంతమైన తర్వాత వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 640 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని ట్రేడ్ ఎక్స్పర్ట్ రమేష్ బాలా ట్విట్టర్ లో షేర్ చేసి అధికారికంగా ప్రకటించారు.


ఈ చిత్రంలో బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం, సల్మాన్ ఖాన్, డింపుల్ కపాడియా, అశుతోష్ రానా మరియు ఇతరులు ఈ బిగ్గీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి విశాల్ మరియు షేకర్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com