మహేష్ సూరపనేని దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన 'హంట్' జనవరి 26, 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ఫిబ్రవరి 10, 2023న ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో OTT అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే, మూవీ మేకర్స్ మరియు డిజిటల్ స్ట్రీమింగ్ సర్వీస్ నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
ఈ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ముంబై పోలీస్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో శ్రీకాంత్ మరియు భరత్ నివాస్, కబీర్ దుహన్ సింగ్, మైమ్ గోపి మరియు ఇతరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భవ్య క్రియేషన్స్‌కు చెందిన వి ఆనంద ప్రసాద్ సమర్పిస్తున్నారు. అరుల్ విన్సెంట్ కెమెరా క్రాంక్ చేయగా, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.