ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాస్పిటల్లో గోవా బ్యూటీ.. ఆందోళనలో అభిమానులు..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 06:34 PM

 దశాబ్దంపాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన గోవా బ్యూటీ ఇలియానా ఆపై బాలీవుడ్ కి పయనమై, అక్కడ పాగా వెయ్యాలనుకుంది. కానీ, ఏ ఒక్క హిందీ సినిమా కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. దీంతో ఇలియానా సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతుంది. ఫోటోషూట్లు, వెకేషన్, బీచ్ చిల్లింగ్ పిక్స్ ను షేర్ చేస్తూ, సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది.


ఐతే, తాజాగా ఇలియానా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో హాస్పిటల్ బెడ్ పై ఉన్న పిక్ ను షేర్ చేసి, అభిమానుల గుండెల్లో గుబులు రేపింది. ఇంతకూ ఇలియానా ఎందుకు హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చిందో తెలియదు కానీ, ఇప్పుడు బాగానే ఉన్నానంటూ చెప్పి, అభిమానుల కలతను తొలగించింది. తను ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com