ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫీషియల్ : విజయ్ సినిమాతో సంజయ్ దత్ గ్రాండ్ కోలీవుడ్ డిబట్..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 04:09 PM

KGF 2సినిమాలో అధీర పాత్ర పోషించి, పాన్ ఇండియా ప్రేక్షకులను విశేషంగా భయపెట్టిన విలన్ సంజయ్ దత్. బాలీవుడ్ హీరో, విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ సంజయ్ దత్ గారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 67వ సినిమాలో కీలకపాత్రలో నటించబోతున్నట్టు జరిగిన ప్రచారం గురించి తెలిసిందే.


తాజాగా ఈ విషయంపై మేకర్స్ నుండి అఫీషియల్ క్లారిటీ వచ్చింది. కాసేపటి క్రితమే తలపతి 67 చిత్రనిర్మాణసంస్థ 7స్క్రీన్ స్టూడియోస్ సంస్థ అధికారిక ట్విట్టర్ ఖాతాలో విలక్షణ నటుడు సంజయ్ దత్ కు హార్టీ వెల్కమ్ చెప్తూ, స్పెషల్ పోస్టర్ షేర్ చేసారు.


పోతే, ఈ నెల 2 నుండి తలపతి 67 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. న్యూ షెడ్యూల్ కాశ్మీర్ లో రేపటి నుండి జరగనుంది. త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com