ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేటెస్ట్ .."కాంతార2" స్క్రిప్ట్ పనులు షురూ..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 21, 2023, 11:33 AM

కన్నడ సెన్సేషనల్ హిట్ "కాంతార" పాన్ ఇండియా భాషల్లో విడుదలై, ప్రతి చోటా ఘనవిజయం సాధించింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.


కొన్ని రోజుల క్రితమే కాంతార ఒక ఫ్రాంచైజీగా రాబోతుందని నిర్మాత విజయ్ కిరంగదుర్ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు కాంతార ఫ్రాంచైజీపై ఎక్జయిటింగ్ న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, కాంతార రెండవ భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులను రిషబ్ శెట్టి ఆల్రెడీ షురూ చేసారని, ఈ మేరకు కోస్టల్ కర్ణాటక అడవి ప్రాంతాలను రిషబ్ సందర్శిస్తున్నారని, జూన్ నుండి షూటింగ్ కూడా మొదలు కాబోతుందని విపరీతమైన ప్రచారం జరుగుతుంది. విశేషమేంటంటే, కాంతార 2 సినిమా కాంతార కు ప్రీక్వెల్ గా తెరకెక్కబోతుంది. వచ్చే ఏడాది వేసవికి కాంతార 2 విడుదల కాబోతుందంట.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com