జీ 5 ఒరిజినల్ సిరీస్ లో భాగంగా రూపొందిన వెబ్ సిరీస్ ATM. ఇందులో బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సుబ్బరాజ్, దివి, రవిరాజ్, కృష్ణ బురుగుల తదితరులు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. చంద్రమోహన్ డైరెక్షన్లో దోపిడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ను హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. ప్రశాంత్ R విహారి సంగీతం అందిస్తున్నారు.
ఈనెల 20 నుండి జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ కి రాబోతున్న ఈ వెబ్ సిరీస్ యొక్క ట్రైలర్ విడుదలైంది. బస్తీ జీవితం పై విరక్తి కలిగిన నలుగురు యువకులు నవాబ్ జీవితం పొందేందుకు చేసిన దోపిడీ చివరికి వారి ప్రాణాల మీదికే రావడం, వారి ప్రాణాలను కాపాడుకునేందుకు మళ్ళీ దోపిడీలనే చెయ్యాలని నిర్ణయించుకోవడం... అనే నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ ఆసక్తిని కలిగిస్తుంది.