ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అహింస ట్రైలర్ : ధర్మం కోసం యుద్ధం చేయాల్సిందే..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 11:39 AM

కాసేపటి క్రితమే "అహింస" ట్రైలర్ విడుదలైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గారు అహింస ట్రైలర్ ను డిజిటల్ లాంచ్ చేసి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. డైరెక్టర్ తేజ నుండి రాబోతున్న ఈ విభిన్న ప్రేమ కథ యొక్క ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం..!


ఇక, ట్రైలర్ విషయానికొస్తే, పిరికిగా ఉండే హీరో తన కుటుంబాన్ని, తన పరివారాన్ని, తనను నమ్ముకున్నవాళ్ళని కాపాడటమే తన ధర్మమని నమ్మి, ధర్మం కోసం శత్రువులతో చేసిన యుద్ధమే ఈ సినిమా అని అర్ధమవుతుంది. అసలెందుకు హీరో యుద్ధం చెయ్యాల్సి వచ్చింది? ఇందులో లాయర్ సదా పాత్రేమిటి? ఇంతకూ అసలు విలన్ ఎవరు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించారు.


ఈ సినిమాతో దగ్గుబాటి అభిరాం హీరోగా పరిచయమవుతున్నారు. గీతికా హీరోయిన్ గా నటిస్తుంది. RP పట్నాయక్ సంగీతం అందించారు.    రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి కిరణ్ నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com