హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన హిట్-2 మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. సీరియల్ కిల్లర్ ను హీరో ఎలా పట్టుకున్నాడు, కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా చేశాడు అనేదే ఈ సినిమా కథ. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా హిట్-2 లో అడివిశేష్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో అడివిశేష్ నటన ఆకట్టుకుంది. మిగతా నటీనటులు కూడా తమ నటనతో మెప్పిస్తారు. ఇంటర్వెల్, క్లైమాక్స్, సెకండాఫ్ థ్రిల్లింగ్ గా ఉండి ఆకట్టుకుంటాయి. అక్కడక్కడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదనే ఫీలింగ్ వస్తుంది. కొన్ని సీన్లను ముందే గెస్ చేయొచ్చు. డైరెక్టర్ శైలేష్ పనితనం ఆకట్టుకుంటుంది. రేటింగ్: 3.5/5.