కొత్త దర్శకుడు సాయి కిరణ్ డైరెక్షన్లో తిరువీర్ రెడ్డి, గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించిన చిత్రం "మసూద". ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. హీరోయిన్ సంగీత ఈ సినిమాలో కీలకపాత్రలో నటించారు.
తాజాగా ఈ సినిమా నుండి చుక్కల్ని తాకే అనే బ్యూటిఫుల్ లవ్ మెలోడీ వీడియో సాంగ్ విడుదలైంది. 'చుక్కల్ని తాకే దారిని అందుకుందాం రమ్మని' అని సాగే ఈపాటను ప్రశాంత్ విహారి స్వరపరచగా, సింగర్ అభయ్ జోధ్ పుర్కర్ పాడారు. శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ అందించారు.
స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మూడవ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చెయ్యడం జరిగింది.