ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పఠాన్' సినిమా రిలీజ్ డేట్ ప్రకటన

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 11:56 AM
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'పఠాన్' సినిమా రిలీజ్ డేట్ ను గురువారం ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా హిందీ, తమిళ్, తెలుగులో విడుదల కానుంది. 'మరో 55 రోజుల్లో పఠాన్ సినిమా విడుదల కానుంది. మీ దగ్గర్లోని థియేటర్లలో చూడండి' షారుఖ్ ఖాన్ ట్వీట్ చేశారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం, దీపికా పదుకొనే కీలక పాత్రల్లో నటించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థకు ఇది 50వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com