ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హ్యాపీ బర్త్ డే రాశీ ఖన్నా !

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 30, 2022, 12:57 PM

సౌత్ మరియు బాలీవుడ్ నటి రాశీ ఖన్నా ఈరోజు తన 32వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమె  1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించారు. ఈ సందర్భంగా  తన జన్మదిన వేడుకలను మొక్కలు నాటారు. ఈ డిల్లి బ్యూటీ నటించిన మొదటి సినిమా ‘మద్రాస్ కేఫ్’ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. డెబ్యుతోనే హిట్ కొట్టిన రాశి, అక్కడి నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా ‘ఊహలు గుసగుస లాడే’ మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా చూసిన వాళ్లు రాశి ఖన్నాకి బాగానే కనెక్ట్ అయ్యారు. ఇంతకన్నా ముందు అక్కినేని త్రయం నటించిన ‘మనం’ సినిమాలో కాసేపు కనిపించింది. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త బొద్దుగా ఉన్న రాశి ఆ తర్వాత స్లిమ్ అయ్యి తన యాక్టింగ్ స్కిల్స్ కి గ్లామర్ ని కూడా తోడయ్యేలా చేసింది.1990 నవంబర్ 30న పుట్టిన రాశి ఖన్నా నేటితో ముప్పై రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంధర్భంగా ఆమెకి విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com