ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నేనొక ప్రేమ పిపాసిని' పాట లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 15, 2022, 11:06 AM

పల్లవి:
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని..

చరణం:
తలుపు మూసినా తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసినా తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని..

చరణం 2: పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను
ప్రేమభిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని..

పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను..

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com