ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీ "జపాన్" ఫస్ట్ లుక్ రిలీజ్ టైం ఫిక్స్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 11:58 AM

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న కొత్త చిత్రం "జపాన్" నుండి ఈ రోజు అంటే నవంబర్ 14న ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ప్రకటించిన మేకర్స్ తాజాగా రిలీజ్ టైం ను తెలుపుతూ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఐదింటికి జపాన్ గా కార్తీ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కార్తీ కెరీర్ లో 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కాబోతున్నట్టు అధికారిక ప్రకటన జరిగింది.


ఈ ప్రాజెక్ట్ ను రాజు మురుగన్ డైరెక్ట్ చేస్తుండగా, అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com