ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హార్ట్ టచింగ్ ఎమోషనల్ రైడ్... 'మీట్ క్యూట్' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 12, 2022, 11:58 AM

నాచురల్ స్టార్ నాని సమర్పణలో ఆయన చెల్లెలు దీప్తి డైరెక్ట్ చేసిన చిత్రం "మీట్ క్యూట్". ఐదు కథల అంథాలజీ చిత్రంగా రూపొందిన ఈ మూవీ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కాబోతుంది.


లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ఐదు మోడరన్ అర్బన్ లవ్ స్టోరీలతో ఎమోషనల్ రైడ్ గా టీజర్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది.


కోలీవుడ్ బుల్లితెర సూపర్ స్టార్ అశ్విన్ కుమార్ లక్ష్మి కాంతన్, వర్ష బొల్లమ్మ, సత్యరాజ్, రుహని శర్మ, రోహిణి, ఆకాంక్ష సింగ్, సురేఖ వాణి, అదా శర్మ, అలేఖ్య హారిక, సునైన, సంచితా పూనాచా ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం అతి త్వరలోనే సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com