ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూవీ రివ్యూ: “యశోద”

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 01:16 PM

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం యశోద. హరి హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకుర్చారు. ఈ సినిమా ఈరోజు విడుదలైంది. 
కథ: సమంత (యశోద) తన సోదరి ఆపరేషన్ కోసం సరోగసీకి అంగీకరిస్తుంది. మధు (వరలక్ష్మి శరత్‌కుమార్), గౌతమ్ (ఉన్ని ముకుందన్) ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పేద అమ్మాయిలను డబ్బు ఆశతో సరోగసి తల్లులుగా ఒప్పిస్తారు. ఈ క్రమంలో యశోద కూడా బిడ్డకు జన్మనివ్వడానికి అంగీకరించింది. అయితే దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని యశోద గ్రహించింది. సరోగసీ పేరుతో జరిగే నేరాలేమిటి? యశోద ఏం చేసింది?, యశోద ఎవరు?, ఇదంతా ఎందుకు చేస్తోంది?, చివరకు సరోగసీ పేరుతో సాగుతున్న అక్రమ వ్యాపారాన్ని ఎలా అడ్డుకుంది? అన్నది మిగతా కథ.
ప్లస్ పాయింట్లు: ఈ సినిమాలో యశోద పాత్రలో నటించిన సమంత తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. తన పాత్రకు తగ్గట్టుగా వేరియేషన్స్‌ని చూపిస్తూ చాలా బాగా నటించింది. ఫస్ట్ హాఫ్‌లో అమాయక యువతిగా.. దూకుడు బాడీ లాంగ్వేజ్, సెకండాఫ్‌లో డామినేటింగ్ యాక్షన్.. ఆమె పాత్ర పర్ఫెక్ట్. సమంత చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేసింది. ఇక విలన్ పాత్రలో కనిపించిన ఉన్ని ముకుందన్ తన లుక్స్ ని, ఫిజిక్ ని తన పాత్రకు తగ్గట్టుగా మార్చుకున్నాడు. అలాగే మరో ప్రధాన పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో ఆకట్టుకుని తన పాత్రకు పూర్తి న్యాయం చేసి ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకులు హరి-హరీష్ రాసిన ఈ సినిమా కథ కూడా బాగుంది. సినిమాలోని కొన్ని సంఘటనలు సమాజంలోని కొన్ని అక్రమాలను ఎత్తి చూపుతాయి.
మైనస్ పాయింట్లు: డైరక్టర్లు హరి-హరీష్ డిఫరెంట్ పాయింట్ తో ఈ స్టోరీని రాసుకున్నా.. ఇంట్రెస్టింగ్ స్టోరీతో సినిమాను పూర్తి స్థాయిలో ఇంట్రెస్టింగ్ గా తీయలేకపోయారు. అక్కడక్కడా స్లోగా సాగే సన్నివేశాల వల్ల సినిమా కాస్త స్లోగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ కొట్టించాయి. పోలీసు దర్యాప్తుల క్రమాన్ని పెంచుతున్నందున ఇది చాలా ఆసక్తికరంగా మరియు ఉత్కంఠభరితంగా ఉండాలి. కానీ ఈ చిత్రంలో చాలా తేలికపాటి విచారణతో ముగించడం అంత ఆహ్లాదకరంగా లేదు. అలాగే చాలా సీన్స్ లాజిక్ లేకుండా సాగుతాయి. అంతేకాదు కొన్ని కీలక సన్నివేశాలను చాలా సింపుల్ గా ముగించారు.
రేటింగ్: 3/5. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com