ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కాటుక కళ్ళను చూస్తే' సాంగ్ లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 11:20 AM

కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే
చాటుగ నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే
ఘాటుగ పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే
రాటుగ సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే
లేటుగు ఇంతందాన్ని చూసానే అనిపిస్తుందే
నా మనసే నీవైపొస్తుంటే

ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి

నీ మతి పోగొడుతుంటె నాకెంతో సరదాగుందే
ఆశలు రేపేడుతుంటే నాకెంతో సరదాగుందే
నిన్నిలా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే
నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యొ అనుకుంటునే
ఇలాగే ఇంకాసేపంటుంటే

ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి


తెలుసుకుంటావా తెలుపమంటావా
మనసు అంచుల్లో నించున్న నా కలని
ఎదురు చూస్తున్న ఎదుటనే ఉన్న
బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని
వేల గొంతుల్లోన మోగిందే మౌనం
నువ్వున్న చోటే నేనని
చూసి చుడంగానే చెప్పిందే ప్రాణం
నేన్నీదాన్నై పోయానని
ఇదేదీ బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదీబాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

తరచి చూస్తూనే తరగదంటున్న
తళుకు వర్ణాల నీ మేను పూలగనీ
నలిగిపొతునే వెలిగిపొతున్న
తనివి తీరేట్టు సంధించు చూపులన్ని
కంటి రెప్పలు రెండు పెదవుల్లా మారి
నిన్నే తినేస్తామన్నాయే
నేదో రేపో అది తప్పదుగా మరి
నీకోసం ఎదైనా సరే
ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com