నైట్రో స్టార్ సుధీర్ బాబు ఇటీవలే "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా ప్రేక్షకుల మెప్పును పొందడంలో పూర్తిగా విఫలమైంది.
తాజాగా సుధీర్ బాబు కొత్త సినిమా ప్రకటన జరిగింది. ఇది సుధీర్ కెరీర్ లో 18వ సినిమాగా రూపొందుతున్న చిత్రం. జ్ఞానసాగర్ ద్వారకా డైరెక్షన్లో, సుధీర్ బాబు నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో కనిపించనున్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ నాయుడు నిర్మిస్తున్నారు.
అక్టోబర్ 31 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని పేర్కొంటూ, స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.