ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సలార్ : 'వర్ధరాజ మన్నార్' గా పృథ్విరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 16, 2022, 11:50 AM

నిన్న జరిగిన ప్రచారం మేరకే ఈ రోజు ఉదయం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ "సలార్" నుండి అద్దిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ బర్త్ డే ను పురస్కరించుకుని సలార్ లో ఆయన పోషిస్తున్న పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసారు మేకర్స్. పోతే, ఇందులో పృథ్విరాజ్ పాత్ర పేరు 'వర్ధరాజ మన్నార్'. హ్యాండ్సమ్ స్టార్ హీరో కాస్తా ముక్కుకి నత్తి , కంఠాభరణాలతో క్రూరమైన విలన్ లుక్ లోకి మారిపోయి అభిమానులను ఒకింత ఆశ్చర్యపరిచారు.


ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలకపాత్రను పోషిస్తున్నారు.  రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ భారీ బడ్జెట్టుతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com