టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ఇటీవలే "అల్లూరి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి రివ్యూలు వచ్చాయి.
ఈ సినిమా విడుదలై కొన్ని వారాలు కూడా గడవక ముందే విష్ణు తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ను ప్రకటించేశాడు. 'వివాహ భోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకుడు.
లేటెస్ట్ గా ఈ సినిమాలో విష్ణుకు జోడిగా నటించబోయే హీరోయిన్ పై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. కోలీవుడ్ నటి రెబా మోనికా జాన్ శ్రీవిష్ణు సరసన నాయికగా నటించబోతున్నారంటూ ప్రకటించారు. తమిళ నటుడు విజయ్ సూపర్ హిట్ మూవీ 'విజిల్' లో అనితగా కీలకపాత్రను పోషించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంది మోనికా.