ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మంత్ ఆఫ్ మధు' టీజర్ కు ప్రముఖుల ప్రశంసలు

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 01:09 PM

నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం "మంత్ ఆఫ్ మధు'. నిన్ననే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ప్రేమలో పడ్డానికి ఒక క్షణం సరిపోతుంది... అదే ప్రేమ నుండి బయటపడ్డానికి ఒక ప్రయాణమే చెయ్యాల్సివస్తుంది... అనే ఇంటరెస్టింగ్ టాపిక్ తో వచ్చిన ఈ టీజర్ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది. అలానే కొంతమంది ప్రముఖుల నుండి కూడా ఈ టీజర్ కు స్పెషల్ అప్లాజ్ వస్తుంది. గౌతమ్ తిన్ననూరి, విక్రమ్ కే కుమార్, సందీప్ రెడ్డి వంగా, అడవిశేష్, రాహుల్ రవీంద్రన్... టీజర్ క్లాస్ గా ఉందని, సినిమా కోసం ఎదురు చూస్తున్నామని ట్వీట్ చేసారు.



టీజర్ తో ఒక్కసారిగా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కలర్స్ స్వాతి కంబ్యాక్ ఫిలిం గా చెప్తున్న ఈ మూవీని శ్రీకాంత్ నాగోతి డైరెక్ట్ చెయ్యగా, కృషివ్ ప్రొడక్షన్, హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానర్లపై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com