ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"జిన్నా" టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 28, 2022, 01:52 PM

మంచు విష్ణు నటిస్తున్న "జిన్నా" నుండి కొంచెంసేపటి క్రితమే టైటిల్ లిరికల్ వీడియో విడుదలైంది. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటను పృథ్వి చంద్ర పాడగా, CK సాహిత్యం అందించారు.



అంతకుముందు విడుదలైన రెండు పాటలు ఫ్రెండ్షిప్ , గోళీసోడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా, ఇప్పుడు విడుదలైన టైటిల్ సాంగ్ ఫుల్ మాస్ స్టఫ్ తో కేకపెట్టిస్తుంది. 



దసరా రోజున అంటే అక్టోబర్ ఐదవ తేదీన విడుదల కాబోతుందని ముందుగా ప్రచారం జరిగినా, ఆ తరవాత దీపావళికి అంటే అక్టోబర్ 21వ తేది నుండి థియేటర్లలో జిన్నా సందడి మొదలు కానుందని టాక్. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com