ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కృష్ణ బృందా విహారి' 3 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 08:55 PM

అనీష్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటించిన 'కృష్ణ బృందా విహారి' చిత్రం సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చినా ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రాప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.75 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో నాగ శౌర్య సరసన షిర్లీ సెటియా జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


'కృష్ణ బృందా విహారి' కలెక్షన్స్ ::::
నైజాం : 1.31 కోట్లు
సీడెడ్ : 0.25 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.28 కోట్లు
ఈస్ట్ : 0.22 కోట్లు
వెస్ట్ : 0.15 కోట్లు
గుంటూరు : 0.23 కోట్లు
కృష్ణా : 0.20 కోట్లు
నెల్లూరు : 0.11 కోట్లు
టోటల్ ఆంధ్రాప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 1.62 కోట్లు (4.70 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com