ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెయిట్ ఈజ్ ఓవర్... కార్తికేయ2 ఇకపై ఓటిటిలో 

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 05:53 PM

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ లీడ్ రోల్ లో నటించిన కార్తికేయ 2 మూవీ ఇటీవల పాన్ ఇండియా భాషల్లో విడుదలై, ఎంతటి భారీ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చందూ మొండేటి డైరెక్షన్లో సోసియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ఉత్తరాదిన పెద్ద ప్రభంజనమే సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లను కలెక్ట్ చేసిన ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
అమోఘమైన ధియేటర్ రన్ ను ఇంకా పూర్తి చేసుకోకముందే కార్తికేయ 2 డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టబోతుంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ ఐదవ తేదీన కార్తికేయ 2 మూవీ జీ 5 ఓటిటిలో, తెలుగు, హిందీ, తమిళ భాషలలో ఎక్క్లూసివ్ గా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com