ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త సినిమా కోసం పూరి జగన్నాథ్ కసరత్తు !

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 02:22 PM

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం తర్వాత పూరి తన నెక్స్ట్ మూవీ ను ఇప్పటి వరకూ ప్రకటించలేదు. తన కొడుకు ఆకాష్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి, అయితే దాని పై కూడా క్లారిటీ రాలేదు.ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ గోవాలో క్యాంప్ వేసుకుని తన కొత్త సినిమా కోసం కసరత్తు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. అతను మరియు అతని టీమ్ కొత్త చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను ప్రారంభించారు. మరి పూరీ ఏ హీరోతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తారో చూడాలి. పూరీ జగన్నాథ్ నెక్స్ట్ మూవీ ఏ హీరో తో, ఎలాంటి సినిమా చేస్తారో అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com