బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన కొత్త చిత్రం "రామ్ సేతు". టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. గ్లామరస్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. దీపావళి కానుకగా అక్టోబర్ 25వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుందని హీరో అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. అలానే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చెయ్యబోతున్నట్టు పేర్కొన్నారు.
అభిషేక్ శర్మ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, అరుణ భాటియా, విక్రమ్ మల్హోత్రా, సుభాస్కరన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.