కన్నడ సినీ పరిశ్రమ నుండి రాబోతున్న మరొక పాన్ ఇండియా చిత్రం "బనారస్". ఈ సినిమాలో జైద్ ఖాన్, సోనాల్ మోంటేరియ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రచన - దర్శకత్వం జయతీర్థ చేసారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి ఔన్నత్యాన్ని, పవిత్రతను ఈ సినిమాలో చూపించబోతున్నారు. పోతే, ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ట్రైలర్ విడుదల కానుంది.
ఇప్పటివరకు ఈ సినిమా నుండి వరసగా లిరికల్ సాంగ్స్ విడుదలవగా, అన్నిటికి ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. నేషనల్ ఖాన్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తిలక్ రాజ్, అహ్మద్ ఖాన్ నిర్మించారు. అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందించారు.