ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాదాస్పద విమర్శకుడి షాకింగ్ నిర్ణయం

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 08:00 PM

బాలీవుడ్ సినిమాలకు షాకింగ్ అండ్ కాంట్రవర్షియల్ రివ్యూలను ఇస్తూ బాగా పాపులరైన క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్. ఇటీవలే జైలుకు కూడా వెళ్లి వచ్చిన కమల్ ఆడియన్స్ కు షాక్ కలిగించే రివ్యూను కాకుండా ట్వీట్ ను చేసాడు.
అదేంటంటే, కమల్ సినిమా రివ్యూలను ఇవ్వడం నుండి తప్పుకుంటున్నాడు. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ల మల్టీస్టారర్ విక్రమ్ వేదనే చివరి సినిమా అంట. ఈ సందర్భంగా బాలీవుడ్ జనాలు ఎవరైతే తనను ఫిలిం క్రిటిక్ గా అంగీకరించలేదో, తన మూవీ రివ్యూలను ఆపేయాలని పోలీసు కేసులు పెట్టారో వారికీ కమల్ కృతజ్ఞతలు తెలిపారు. అలానే బాలీవుడ్ హిస్టరీలో తనకొక ప్రత్యేక క్రిటిక్ స్థానాన్ని ఇచ్చిన మరికొంతమందికి కూడా కమల్ కృతజ్ఞతలు తెలియచేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com