కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "గాడ్ ఫాదర్". పొలిటికల్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ లో నటిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, బిజుమీనన్, సునీల్, పూరి జగన్నాధ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో తెలుగు, హిందీ భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా లేటెస్ట్ గా మలయాళంలో కూడా రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ సస్పెన్స్ ఎనౌన్స్మెంట్ చేసారు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాకయ్యారు.
ఎందుకంటే, గాడ్ ఫాదర్ మూవీ, 2019లో విడుదలైన మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' కి అఫీషియల్ తెలుగు రీమేక్ మరి. రీమేక్ ఫిలింను ఒరిజినల్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చెయ్యాలనున్న మేకర్స్ డెసిషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది, సినిమా విడుదల తరవాత తెలుస్తుంది.