కృష్ణంరాజు మరణవార్త తెలియగానే ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చాయని, ఆయన లేని లోటు తీరనిది అని హీరోయిన్ అనుష్క తెలిపారు. కృష్ణంరాజు మరణవార్త తనను చాలా బాధించిందని తెలిపింది. కృష్ణంరాజు లాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంత వరకూ చూడలేదని, ఆయన మనసు చాలా గొప్పదని, ఆయన ఎప్పటికీ అభిమానుల మనసులో నిలిచి ఉంటారని తెలిపింది. కృష్ణంరాజు ఆత్మకు శాంతి కలగాలని అనుష్క కోరింది.