ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగులో కూడా రిలీజ్ కాబోతున్న శింబు కొత్త సినిమా

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 05:28 PM

కోలీవుడ్ స్టార్ హీరో శింబు, విభిన్న చిత్రాల దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో నటించిన సినిమా "వెందు తనిందతు కాదు". ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా అదే రోజున తెలుగులో కూడా విడుదల కాబోతున్నట్టు తెలిపారు. తెలుగులో ఈ సినిమాకు "ది లైఫ్ ఆఫ్ ముత్తు" అనేది టైటిల్. తెలుగులో ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ గారు సమర్పిస్తున్నారు.
పోతే, ఈ సినిమాకు AR రెహ్మాన్ సంగీతం అందించారు. వేల్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఇషారి గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com