ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవర్​ఫుల్ అత్త పాత్రలో విజయశాంతి?

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 05, 2022, 12:23 PM

కొరటాల శివ డైరెక్షన్​లో వస్తున్న ఎన్టీఆర్ తాజా సినిమాలో విజయశాంతి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ అత్త పాత్ర పవర్​ఫుల్​గా ఉంటుందట. గతంలో వాణిశ్రీ, శారద పోషించిన పాత్రల తరహాలో ఈ పాత్రను రూపొందించారట. అందుకు విజయశాంతి సరిగ్గా సూట్ అవుతుందని భావించిన కొరటాల ఆమెను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె పాత్ర ఎన్టీఆర్ కి అత్తగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో ఈ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ కూడా రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అద్భుతంగా ఉంది. అందుకు తగ్గట్టుగానే తారక్ కూడా తన పాత్ర కోసం డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com