ట్రెండింగ్
Epaper    English    தமிழ்

RRV ప్రీ రిలీజ్ ఈవెంట్ :ఒకేవేదికపై ముగ్గురు మెగాహీరోలు

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 10:11 AM

యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ నుండి రాబోతున్న కొత్త చిత్రం "రంగరంగ వైభవంగా". గిరీశాయ డైరెక్షన్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది.
ఈ రోజు సాయంత్రం ఐదింటికి హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. ముగ్గురు మెగా హీరోలను ఒకే వేదికపై చూసే అవకాశం రావడంతో ఆడియన్స్ ఈ ఈవెంట్ పట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన థియేటర్లలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com