రకుల్ ప్రీత్ సింగ్... నిన్న మొన్నటి వరకు తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఈ బ్యూటీ ఏమైందో తెలియదు అసలు న్యూస్ లోనే లేదు. అదీకాక రకుల్ కి తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కెళ్ళిపోయింది. దీంతో రకుల్ తెలుగు ప్రేక్షకులకు కనిపించి చాన్నాళ్ళే అయిపోతుంది.
టాలీవుడ్ జనాలు రకుల్ ను మర్చిపోతున్న సమయంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రకుల్ ను వెలుగులోకి తీసుకొచ్చారు. రకుల్ నటించిన తొలి మ్యూజిక్ వీడియోను ఈ రోజు బన్నీ డిజిటల్ గా విడుదల చేసి, ఆమెకు బిగ్ సపోర్ట్ ఇచ్చారు. రకుల్ ప్రేమికుడు జాకీ భగ్నానీ నిర్మించిన ఈ వీడియో తెలుగు, తమిళ వెర్షన్లు ప్రస్తుతం యూట్యూబులో అందుబాటులోకొచ్చేశాయి.. రకుల్ ప్రయత్నాన్ని మీరు కూడా చూసి, ఆనందించండి.