ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాంటెడ్ పండుగాడ్ : వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ రివీల్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 26, 2022, 05:14 PM

శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబా కోవెలమూడి,వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "వాంటెడ్ పండుగాడ్". పట్టుకుంటే కోటి అనేది శీర్షిక. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇందులో సునీల్, అనసూయ భరద్వాజ్, సుధీర్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. "అఖిల్ చుక్కనేని" క్యారెక్టర్ లో వెన్నెల కిషోర్ ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వస్తుంది. హిలేరియస్ ఎంటెర్టైన్మెంట్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి అందిస్తున్నారు. ఆగస్టు 19న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com