ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ ఆంటోనీ కొత్త సినిమా "దోషి"

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 22, 2022, 02:34 PM

"బిచ్చగాడు" ఫేమ్ విజయ్ ఆంటోనీ ఆ సినిమాతో తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమా తెలుగులో ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిచ్చగాడు ఫేమ్ తో విజయ్ సినిమాలపై టాలీవుడ్ ప్రేక్షకులు ఇంటరెస్ట్ చూపించడం మొదలెట్టారు.
లేటెస్ట్ గా విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం "దోషి". CS ఆముదన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం నుండి జూలై 24న ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యబోతున్నట్టు కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఇన్ఫినిటీ ఫిలిం పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com