ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాన్వికపూర్ "గుడ్ లక్ జెర్రీ" ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 02:58 PM

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన "కొలమావు కోకిల" కు హిందీ రీమేక్ గా తెరకెక్కిన చిత్రం "గుడ్ లక్ జెర్రీ". ఇందులో జాన్వీ కపూర్ మెయిన్ లీడ్ లో నటించింది. సిద్దార్ధ్ సేన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్ రాయ్, సుభాస్కరన్, మహావీర్ జైన్ సమర్పిస్తున్నారు. ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన తను వెడ్ మను, హసీనా దిల్ రుబా చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. పరాగ్ చాబ్రా సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఎమోషనల్ గా, ఫన్నీ గా, థ్రిల్లింగ్ గా సాగింది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలపోసిన ఈ చిత్రం జాన్వీ కి ఎలాంటి విజయాన్ని కట్టబెడుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com