బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ సోషల్ మీడియాలో తరచూ యాక్టిివ్ గా ఉంటారు. తాజాగా సోషల్ మీడియా వేదిక గా ఒక గుడ్ న్యూస్ ను షేర్ చేశారు అలియా. ప్రస్తుతం తను ప్రెగ్నెన్సీ తో ఉన్నట్లు తెలిపారు. ఆమె స్కాన్ ను చూస్తున్న ఒక ఫొటో ను షేర్ చేశారు. అవర్ బేబీ కమింగ్ సూన్ అంటూ రాసుకొచ్చారు.బాలీవుడ్ హ్యండ్సం హీరో రన్బీర్ కపూర్ తో అలియా భట్ ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి అలియా ఆరోగ్యం పై మరియు గర్భిణీ అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా చేసిన ప్రకటన తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ నుండి విడుదల అయిన పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో సీత పాత్రలో నటించిన అలియా భట్ పాత్రకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.