బాలీవుడ్ ప్రేమ జంట ఆలియాభట్, రణ్ బీర్ కపూర్ ఏప్రిల్ 14న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైన విషయం అందరికి తెలిసిందే. పెళ్ళైన మరుసటి రోజు నుండే ఎవరి సినిమాలతో వారు బిజీగా మారిపోయి అందరికి షాక్ ఇచ్చారు. ఈ విషయం పక్కన పెడితే, లేటెస్ట్ గా ఈ రోజు ఉదయం ఆలియా తాను గర్భం దాల్చిన విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ అల్ట్రా సౌండ్ స్కాన్ చేయించుకుంటున్న ఆలియా కంప్యూటర్ స్క్రీన్ పై తన చిన్నారిని చూసుకుంటూ మురిసిపోతుంటే, ఆ పక్కనే రణ్ బీర్ కపూర్ నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఈ బ్యూటిఫుల్ పిక్ ను ఇన్స్టా లో షేర్ చేసి, అవర్ బేబీ కమింగ్ సూన్ అని కామెంట్ చేసింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో కామెంట్ల వెల్లువ వెల్లువెత్తింది. ఆలియా చేసిన పోస్ట్ పై ట్వీట్లు, రీ ట్వీట్లు, షేరింగులు, కామెంట్లు.... చేస్తూ నెటిజన్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంతటి సంతోషకరమైన వార్త చెప్పిన ఆలియాకు పలువురు సినీ సెలెబ్రిటీలు, అభిమానులు, సన్నిహితులు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.