బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సినీ ఇండస్ట్రీలో కాలుపెట్టి ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, "పఠాన్" నుండి షారుఖ్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను కొంచెంసేపటి క్రితమే మేకర్స్ రిలీజ్ చేసారు. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం కీరోల్ ప్లే చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుండి షారుఖ్ ఫస్ట్ లుక్ విడుదలై సోషల్ మీడియాలో చిన్నపాటి తుఫానును రేపింది. ఈ గ్లిమ్స్ లో కండలు తిరిగిన దేహంతో, రగ్డ్ లుక్ లో కనిపించిన షారుఖ్ ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. ఇండస్ట్రీలో ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకున్న షారుఖ్, తాజాగా రిలీజైన పోస్టర్ లో 30ఏళ్ళ యువకుడిలా కనిపించడం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న విడుదలవబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.