ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై రొమాన్స్ చెయ్యనంటున్న రణ్ బీర్ ... కారణం?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 12:22 PM

బాలీవుడ్ లవర్ బాయ్ రణ్ బీర్ కపూర్ కెరీర్ ప్రారంభించినప్పటి నుండి లవ్ స్టోరీలలోనే ఎక్కువగా నటిస్తూ వచ్చాడు. సావరియా, అంజానా  అంజాని, రాక్ స్టార్, బర్ఫీ, ఏ దిల్ హై ముష్కిల్, ఏ జవానీ హై దివాని వంటి విభిన్న లవర్ స్టోరీలలో నటించిన రణ్ బీర్ కు ఆ సినిమాలంటే మొహం మొత్తేసిందట. ఈ విషయాన్ని నిన్న జరిగిన తన కొత్త సినిమా "షంషేరా" ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో స్వయంగా రణ్ బీర్ చెప్పడంతో  ఈ విషయం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. రొమాంటిక్ సినిమాలలో నటించి చిరాకు వచ్చిందని, దీంతో తన కంఫర్ట్ జోన్ నుండి బయటకొచ్చి షంషేరా, బ్రహ్మాస్త్ర వంటి విభిన్నమైన సినిమాలను ఒప్పుకున్నానని రణ్ బీర్ చెప్పారు. ఈ విషయంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుండి తమ అభిమాన నటుడి నుండి డిఫరెంట్ సినిమాలను ఆశించవచ్చని పండగ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం... ఆలియా వల్లే రణ్ బీర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని, ఆమెపై మండిపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com