విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో యంగ్ హీరో నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం "థాంక్యూ". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా టైం తీసుకుంది. మొనట్టి వరకు కూడా ఈ మూవీ పై ఎలాంటి అప్డేట్ లేక చైతూ అభిమానులు అగ్గిలం మీద గుగ్గిలమయ్యారు. ఫ్యాన్స్ మొర ఆలకించిన థాంక్యూ టీం కొన్నిరోజుల నుండి వరస అప్డేట్లనిస్తూ వస్తుంది. రిలీజ్ డేట్ తో మొదలుపెట్టి, లిరికల్ సాంగ్స్, టీజర్ అంటూ సైలెంట్ ప్రమోషన్స్ చేస్తున్నారు.
మూవీ కంటెంట్ ను పక్కనపెడితే, ఈరోజుల్లో ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఒక టాప్ ప్రొడ్యూసర్ అయ్యుండి దిల్ రాజు థాంక్యూ ప్రమోషన్స్ ను పట్టించుకోవడం లేదని నిన్నటివరకు అంతా అనుకున్నారు. తాజాగా థాంక్యూ మూవీ టీం ప్రమోషన్స్ ను షురూ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య, రాశి ఖన్నా కలిసి పలు మీడియా ఛానెల్స్ కు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారట. థాంక్యూ చిత్రబృందం ఎట్టకేలకు ప్రమోషన్స్ ను షురూ చేసారని చైతు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమా జూలై 8వ తేదీన ప్రేక్షకులను పలకరించబోతుంది.