ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షారుఖ్ ఖాన్ జవాన్‌ సినిమా పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 23, 2022, 03:17 PM

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సౌత్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఈ చిత్రానికి 'జవాన్' అనే టైటిల్ ను మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ అండ్ సిజ్లింగ్ బ్యూటీ దీపికా పదుకొణె అతిధి పాత్రలలో కనిపించనున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com