టాలీవుడ్ డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ వంశీ పైడిపల్లి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దిల్ రాజు కోలీవుడ్ నిర్మాణరంగంలోకి ప్రవేశిస్తున్నారు.
రేపు హీరో విజయ్ పుట్టినరోజు కావడంతో తలపతి 66 మూవీ టైటిల్ పోస్టర్ ను కొంచెం సేపటి క్రితమే మేకర్స్ రివీల్ చేసారు. గతంలో వచ్చిన పుకార్ల ప్రకారమే తమిళంలో ఈ సినిమాకు "వారసి" అనే టైటిల్ ను ఖరారు చెయ్యడం జరిగింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో విజయ్ సూటు బూటు ధరించి, మంచి క్లాస్ లుక్ లో సూపర్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఇక, తెలుగు టైటిల్ రివీల్ అవ్వాల్సి ఉంది. ఇటీవలే ఒక లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుంది.