ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షారుఖ్ తో బిగ్ బి... ఫర్హాన్ కొత్త సినిమా షురూ!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 06:12 PM

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆల్ టైం బ్లాక్ హిట్ లలో డాన్ ఒకటి. 1978లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత షారుఖ్ ఈ సినిమాకు 2006లో , 2011లో సీక్వెల్ చిత్రాలను తెరకెక్కించి సూపర్ హిట్లను అందుకున్నాడు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో డాన్ 3 రాబోతుందనే వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ లో నటించిన డాన్ 1,డాన్ 2 సినిమాలకు కొనసాగింపుగా డాన్ 3 ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకాభిమానులు తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. షారుఖ్ ఈ మధ్య సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వడంతో ఇక డాన్ 3 ఉండకపోవచ్చని అంతా అనుకుంటుండగా, మళ్ళీ ఈ వార్త తెరపైకి రావడంతో ఆసక్తిగా మారింది. డాన్ 3 స్క్రిప్ట్ పనులను ఫర్హాన్ అక్తర్ ఈ మధ్యనే స్టార్ట్ చేసారని, అందులో అమితాబ్ బచ్చన్ కూడా నటించబోతున్నారని టాక్. ఐతే, ఈ వార్తలపై షారుఖ్ కానీ, ఫర్హాన్ కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.    






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com