టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తెరకెక్కిస్తున్న సినిమాతో తమిళ సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు వంశీ పైడిపల్లి డైరెక్షన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక మండన్నా హీరోయిన్. గత నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభవగా, ఇప్పటికే రెండు మేజర్ షెడ్యూల్స్ ను పూర్తి చేసినట్టు సమాచారం.
రేపు తలపతి విజయ్ పుట్టినరోజు కావడంతో మేకర్స్ స్పెషల్ సర్ప్రైజ్ ను ప్లాన్ చేసారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఆ సర్ప్రైజ్ ఏంటో రివీల్ చెయ్యనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, విజయ్ ఫ్యాన్స్ కు మేకర్స్ డబుల్ ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేశారట. సాయంత్రం ఒక పోస్టర్, అర్ధరాత్రి పన్నెండు గంటలకు మరొక పోస్టర్ ను రిలీజ్ చెయ్యబోతున్నారని టాక్. ఐతే, ఇందులో ఒకటి టైటిల్ పోస్టర్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు. ఈ స్పెషల్ సర్ప్రైజ్ లు ఏమై ఉండొచ్చని విజయ్ ఫ్యాన్స్ కుతూహలంగా ఎదురు చూస్తున్నారు.